- జబర్దస్త్ కమెడియన్లతో షో
నర్సాపూర్(జి), వెలుగు: నిర్మల్ జిల్లా నర్సాపూర్(జి) మండలంలోని గొల్లమాడలో బుధవారం మల్లన్న దేవరకు మహిళలు బోనం సమర్పించారు. గ్రామంలోని ప్రజలు సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ ప్రత్యేక పూజలు చేశారు.
గ్రామస్తుల ఆధ్వర్యంలో జబర్దస్త్ కామెడీ షో సభ్యులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అన్నదానం చేపట్టారు. కార్యక్రమంలో సర్పంచ్ చెన్న వసంత లస్మయ్య, ఉప సర్పంచ్ భూమన్న, రాజేశ్వర్, లంబడి గంగాధర్, కాల్వ లింగం, కుమ్మరి రమేశ్, ధనగరి లస్మన్న, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
