అభివృద్ధి పనులు స్పీడప్ చేయాలి : కలెక్టర్ కుమార్ దీపక్

అభివృద్ధి పనులు స్పీడప్ చేయాలి : కలెక్టర్ కుమార్ దీపక్
  •     కలెక్టర్ కుమార్ దీపక్

చెన్నూరు, వెలుగు: జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు స్పీడప్ చేయాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. చెన్నూరు మండలంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నిర్మాణ పనులను బుధవారం కలెక్టర్​ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యారంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి స్టూడెంట్లకు అవసరమైన సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. డిగ్రీ కాలేజీ పనులు స్పీడప్ ​చేసి త్వరగా పూర్తిచేయాలన్నారు. 

పట్టణంలో చేపట్టిన ప్రైమరీ హెల్త్​సెంటర్ ​నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అమృత్ 2.0 పథకం కింద పట్టణంలో చేపట్టి నీటి ట్యాంకుల నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తిచేసేలా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు.