ఆహా.. ఇతని ఐడియాను కొట్టేవాడే లేడు.. లేని దేశం పేరున ఏకంగా ఎంబసీ నే పెట్టాడు.. ప్రధాని, రాష్ట్రపతితో..

ఆహా.. ఇతని ఐడియాను కొట్టేవాడే లేడు.. లేని దేశం పేరున ఏకంగా ఎంబసీ నే పెట్టాడు.. ప్రధాని, రాష్ట్రపతితో..

ఇతని గురించి తెలుసుకుంటే.. ఇప్పటి వరకు దేశంలో చూసిన మోసగాళ్లంతా ఈయన కింద చీపురు పుల్లతో సమానం అనిపిస్తుంది. ఎంతో మంది గజదొంగలను చూశాం.. ఎందరో దోపిడీ దారులను చూశాం. కానీ.. అలాంటి వారికి వాళ్ల తాతలకే తాత అనుకోవచ్చు.. తోపలకే తోపు అనుకోక తప్పదు. ఇలాంటి ఐడియా ఇప్పటి వరకు ఎవరికీ వచ్చి ఉండకపోవచ్చు అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఈయన చేసింది మామూలు పని కాదు. ఒక దేశాన్ని సృష్టించాడు. దాని పేరున ఎంబసీ పెట్టేశాడు. అంటే రాయబార కార్యాలయం. ఈ సంచలన వార్త దేశంలోనే కాదు.. ప్రపంచ దేశాలలో కూడా చర్చనీయాంశంగా మారింది. 

వివరాల్లోకి వెళ్తే.. బుధవారం (జులై 23) నోయిడా స్పెషల్ టాస్క్ ఫోర్స్ (NST) అధికారులు ఢిల్లీ ఔట్ స్కర్ట్స్ లో.. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సరిహద్దు జిల్లా ఘజియాబాద్ కవీ నగర్ ప్రాంతంలో ఒక ఎంబసీ నడుపుతున్న ముఠాను అరెస్టు చేశారు. రాబయార కార్యాలయంలో ఉండే హై ఎండ్ నెంబర్ ప్లేట్స్ ఉన్న టాప్ మోడల్ కార్లు పార్క్ చేసిన ఆఫీసును సీజ్ చేశారు. హర్ష వర్ధన్ జైన్ అనే మాస్టర్ మైండ్ కు వచ్చిన ఆలోచనను చూసి అధికారులు ఇంకా షాక్ నుంచి కోలుకోలేకపోతున్నారు. 

టాస్క్ ఫోర్స్ పోలీసులు రూ.44 లక్షలతో పాటు, ఫారెన్ కరెన్సీ, ఫేక్ డాక్యుమెంట్లు సీజ్ చేశారు. వీటితో పాటు డిప్లొమాటిక్ నెంబర్ ప్లేట్లు ఉన్న నాలుగు కార్లు, 18 డిప్లొమాటిక్ నెంబర్ ప్లేట్లు, 12 డిప్లొమాటిక్ పాస్ పోర్టులను కూడా స్వాధీనం చేసుకున్నారు.  విదేశాంగ మంత్రిత్వ శాఖ (Ministry of External Effairs) సీల్, పోర్జింగ్ చేసిన రెండు పాన్ కార్డులు, విదేశాలకు చెందిన 34 సీల్స్ (ముద్ర), రెండు ఫేక్ ప్రెస్ కార్డులు, వివిధ కంపెనీల డాక్యుమెంట్స్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఉత్తరప్రదేశ్ అడిషనల్ డీజీపీ అమితాబ్ యాష్ తెలిపారు. 

నకిలీ రాయబార కార్యాలయంతో ఏం చేస్తున్నారు :

ఫేక్ ఎంబసీ ఏర్పాటు చేసిన హర్షవర్ధన్ జైన్ ముఠా.. హై ప్రొఫైల్ ఆఫీసర్లుగా కటింగ్ ఇచ్చారు. విదేశాల్లో చదవాలంటే పాస్ పోర్టులు మంజూరు చేయడం, ప్రాసెసింగ్ చేయడం, ఆ యా దేశాల నుంచి పర్మిషన్ ఇప్పించడం ఇలాంటి పనులు ఎంబసీ చేస్తుంటుంది. ఎంబసీ ఏర్పాటు చేసుకుని.. అధికారిగా నమ్మించి ఎంతో మందిని ఆ దేశానికి పంపిస్తామని ఆశ కల్పిస్తారు. పెద్ద ఉద్యోగం, జీతం ఉంటుందని చెప్పి.. లక్షల్లో డబ్బులు వసూలు చేస్తారు. 

ALSO READ | మానవ మెదడు గెలిచింది..అంతర్జాతీయ గణిత పోటీలో టీనేజర్లు AIని ఓడించారు

ఆ దేశం నుంచి పర్మిషన్ రావాలంటే, విసా మంజూరు కావాలంటే ఉన్న టెక్నికల్ ఇష్యూస్ ను చెప్తూ.. భారీ ఎత్తున కలెక్ట్ చేస్తారు. అదే విధంగా హవాలా మార్గంలో డబ్బులను కూడా విదేశాలకు పంపడం, బ్లాక్ మనీని తీసుకురావడం చేస్తామని  చెప్పి.. కోట్ల రూపాయల దందా నడుపుతున్నారు. సాధారంగాణగా ఎంబసీ అంటే అధికారులకు సైతం డౌట్ రాదు. ఎందుకంటే హై ప్రొఫైల్ జాబ్స్.. హై సెక్యూరిటీ ఉన్న ఆఫీసులు అవి. చిన్నా చితకా మోసాలతో ఎప్పుడు బయటపడతాం.. కొడితే ఏకంగా కుంభస్థలాన్నే కొట్టాలని అనుకున్నట్లుంది. అందుకే.. ఏకంగా రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేసి లక్షల్లో సంపాదిస్తూ అధికార హోదాను ఎంజాయ్ చేస్తున్నారు. 

ప్రపంచ పటంలో లేని దేశం సృష్టించారు:

ఘజియాబాద్ కు చెందిన హర్షవర్ధన్.. కవీ నగర్ ఏరియాలో ఫేక్ ఎంబసీ నడిపిస్తుండటం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. వెస్ట్ ఆర్కిటికా, సబోర్గా, పౌల్వియా, లొడొనియా దేశాలకు అంబాసిడర్ ను అని చెప్పి పెద్ద కార్యాలయాన్ని అధికారిక హంగులతో నడిపిస్తున్నాడు. మామూలుగా అయితే ఎంబసీ అనేది దేశ ప్రజల తరఫున, ప్రభుత్వం తరఫున ఆయా దేశాలతో సంబంధాలు నెలకొల్పే అధికారిక సంస్థ. అలాంటి ఎంబసీ ఏర్పాటు చేసుకుని విసా లు ఇప్పించడం, పాస్ పోర్టు రెన్యూవల్ చేయటం, విదేశాలలో ఉన్న పౌరులకు డబ్బులు తీసుకుని సర్వీస్ చేయడంతో పాటు పలు వాణిజ్య కార్యకలాపాలు చేయడం వీళ్లు చేస్తున్న పని. 

అయితే రాయబార కార్యాలయం నడిపే క్రమంలో ఏకంగా ఫేక్ కంట్రీనే క్రియేట్ చేసి.. అక్కడికి పంపిస్తామని జనాలకు ఆశచూపించి భారీస్థాయిలో దండుకుంటున్నారు. వెస్ట్ ఆర్కిటికా దేశానికి విసాలు మంజూరు చేస్తూ.. అద్భుతమైన కెరియర్ ఆశ చూపిస్తూ.. టూరిస్టులకు ఎరవేస్తూ బాగానే వెనకేశారంట. అయితే వెస్ట్ ఆర్కిటికా అనేది దేశం కానే కాదు. అంటార్కిటికాలో గ్రాండ్ డచ్చీ పేరున పిలువబడే చిన్న ప్రాంతం అది. ఆ ప్రదేశాన్ని దేశంగా చూపిస్తూ అమాయకుల నుంచి డబ్బులు సంపాదిస్తున్నారంటే వీళ్లది ఎంత పెద్ద ప్లానో. 

రాయబార కార్యాలయం అంటే దేశ ప్రధాని, రాష్ట్రపతులతో సంబంధాలు ఉంటాయి కదా. అది కూడా మెయింటైన్ చేశారు. ప్రధాని మోదీతో ఫోటో దిగినట్లు ఫేక్ ఆల్బమ్ క్రియేట్ చేసి కార్యాలయంలో పెద్ద ఫ్రేమ్ నే ఏర్పాటు చేశారు. అంతే కాకుండా మాజీ రాష్ట్రపతి ఏపీజే. అబ్దుల్ కలాంతో దిగిన ఫోటో, ఇతర మంత్రులతో కలిసిన సందర్భాలను ఫోటో ఫ్రేమ్ లుగా పెట్టి.. అఫీషియల్ లుక్ ఇచ్చారు. దీంతో పోలీసులకు కూడా డౌట్ రాకుండా దర్జాగా దందా నడుపుతున్నారు. హవాలా కార్యకలాపాలు, విదేశాల్లో ఉన్న కంపెనీలకు సర్వీస్ లు ఇవ్వటం, ఇక్క ఫేక్ కంపెనీలు క్రియేట్ చేసి వాటి ట్రాన్జాక్షన్స్ చేయడం లాంటి అధికారులు కూడా ఊహించని దందా నడుపుతున్నారు. ఇంత పెద్ద సెటప్ చేసి, రాయబార కార్యాలయాన్నే నడుపుతున్న జైన్ టీమ్ ను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు పోలీసులు.