చేప పిల్లల సప్లయ్ కి 6 బిడ్లు దాఖలు

చేప పిల్లల సప్లయ్ కి 6 బిడ్లు దాఖలు

యాదాద్రి, వెలుగు: చేప పిల్లల సప్లయ్​కి సంబంధించి ఈ–టెండర్లకు మూడోసారి గడువు పెంచడంతో 6 బిడ్లు దాఖలయ్యాయి. ఏపీకి చెందిన నలుగురు, నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు కాంట్రాక్టర్లు రూ.6.50 లక్షల చొప్పున ఈఎండీ చెల్లించారు. టెండర్లలో పాల్గొన్నవారు పేర్కొన్న అడ్రస్​కు ఫిషరీస్ డిపార్ట్​మెంట్ అధికారులు వెళ్లి ఇన్​స్పెక్షన్​ చేయనున్నారు. 

ఈ నెల 25లోగా కలెక్టర్ ఆధ్వర్యంలో బిడ్లు ఓపెన్​ చేసి ప్రపోజల్ రేటు కంటే ఎవరు తక్కువ రేటు కోట్​చేస్తే వారిని ఎల్–1, 2, 3గా గుర్తిస్తారు. ఎల్–1 చేపల సప్లయ్​కి ఆసక్తి చూపకంటే అతను చెల్లించిన ఈఎండీ రూ.6.50 లక్షలను జప్తు చేస్తారు. అనంతరం ఎల్–-2కు అవకాశం ఇస్తారు. యాదాద్రి జిల్లాలోని 1,155 చెరువుల్లో చేపల పెంపకానికి 687 అనువుగా ఉన్నాయని అధికారులు గుర్తించారు. వీటిల్లో 2.80 కోట్ల చేప పిల్లలను వదలాలని ని
ర్ణయించారు.