ప్రతిభ చూపిన క్రీడాకారులకు ప్రోత్సాహం : గూడూరు నారాయణ రెడ్డి

ప్రతిభ చూపిన క్రీడాకారులకు ప్రోత్సాహం :  గూడూరు నారాయణ రెడ్డి
  • బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు గూడూరు నారాయణ రెడ్డి

యాదాద్రి, వెలుగు: పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులను ప్రోత్సాహకాలు అందిస్తామని ప్రధానమంత్రి క్రీడా మహోత్సవం కన్వీనర్​, బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు గూడూరు నారాయణ రెడ్డి తెలిపారు.  ప్రధానమంత్రి క్రీడా మహోత్సవం 2025-26 పోటీలపై నిర్వహించిన సన్నాహక మీటింగ్​లో ఆయన మాట్లాడారు. ఈ నెల 20 నుంచి 24 వరకూ భువనగిరి నియోజకవర్గం పరిధిలోని మండలాలు, మున్సిపాలిటీల్లో వాలీబాల్​, కబడ్డీ, ఖోఖో  పోటీలు నిర్వహిస్తామని తెలిపారు.

 ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ప్రోత్సహించడంతో పాటు నగదు బహుమతి అందిస్తామని చెప్పారు.  జనవరి 28 నుంచి ఫిబ్రవరి 5 వరకూ భువనగిరిలో నిర్వహిస్తామని ఆయన తెలిపారు.  ఈ పోటీల్లో క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన కోరారు. ఈ మీటింగ్​ లో పడమటి జగన్మోహన్​ రెడ్డి, లింగస్వామి, కపిల్​, ఉషాకిరణ్​ ఉన్నారు.