నల్గొండ కు కార్పొరేషన్ హోదా..గెజిట్ విడుదల చేసిన ప్రభుత్వం

నల్గొండ కు కార్పొరేషన్ హోదా..గెజిట్ విడుదల చేసిన ప్రభుత్వం

నల్గొండ, వెలుగు: నల్గొండ మున్సిపాలిటీకి కార్పొరేషన్ హోదాను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వ సెక్రటరీ కే శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. పాలనపరంగా నల్గొండకు ఎక్కువ అధికారాలు, విస్తృత పరిధి పెరిగే అవకాశం ఉంది. అభివృద్ధి కోసం నిధులు పెరుగనుండటంతో పాటు రాష్ట్ర, కేంద్ర పథకాలు నేరుగా అందే అవకాశం ఉంది. కొత్త డివిజన్లను  పునర్వ్యవస్థీకరించనున్నారు.  

మేయర్, డిప్యూటీ మేయర్ వ్యవస్థ అమలులోకి రానుంది. కమిషనర్ స్థాయి అధికారుల ద్వారా పాలన మరింత బలోపేతం కానుంది. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, స్ట్రీట్ లైట్స్ వంటి మౌలిక వసతుల అభివృద్ధి వేగవంతం, పట్టణ ప్రణాళిక, టౌన్ ప్లానింగ్‌లో కార్పొరేషన్ నిబంధనలు అమలు ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్ విధానాల్లో మార్పులు జరుగుతాయి. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నల్లగొండ కార్పొరేషన్ కు ఎన్నికలు జరగనున్నాయి.