
ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి నగరంలో రౌడీషీటర్ హల్ చల్ చేశాడు. ఇద్దరు మహిళలను కిడ్నాప్ చేసిన రౌడీషీటర్ అజీమ్.. తన మాట వినకపోతే చంపేస్తానని కత్తులతో బెదిరించాడు. కిడ్నాప్ నకు గురయిన మహిళ అతని తెలియకుండా తన భర్తకు లొకేషన్ చేసింది.
మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా.. శుక్రవారం ( సెప్టెంబర్ 12) రాత్రి విధుల్లో ఉన్న సిఐ రామకిషోర్ బృందం చాకచక్యంగా నిందితులను పట్టుకున్నారు. పోలీసులు వెంట పడుతున్నారని గమనించిన కిడ్నాపర్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో రెండు కార్లను,ద్విచక్ర వాహనాలను ఢీ కొడుతూ జనాలను భయబ్రాంతులకు గురి చేస్తూ ...పారిపోయేందుకు ప్రయత్నించాడు.
ఎట్టకేలకు అలిపిరి సీఐ ఆధ్వర్యంలోని గస్తీ బృందం కిడ్నాపర్ ను సినీ తరహాలో వెంబడించి పట్టుకున్నారు. కిడ్నాప్ నకు గురైన తల్లీకూతుళ్లను క్షేమంగా ఇంటికి చేర్చి.. నిందితుడైన రౌడీషీటర్ ను అదుపులోకి తీసుకొని ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. నిందితుడిని అజీమ్గా గుర్తించిన పోలీసులు.. ఈ రౌడీషీటర్ పై గతంలో పలు కేసుల్లో అరెస్టయి జైలు జీవితం గడిపాడు. అజీమ్ పై
ఈస్టు, ఎంఆర్ పల్లి,అలిపిరి,మహిళా పోలీస్ స్టేషన్లలో పలు కేసులున్నాయని పోలీసులు తెలిపారు.