అష్మితా సంచలన విజయం

అష్మితా సంచలన విజయం

కౌలాలంపూర్‌‌‌‌ : ఇండియా యంగ్ షట్లర్‌‌‌‌ అష్మితా చాలిహా.. మలేసియా మాస్టర్స్‌‌‌‌లో సంచలన విజయం సాధించింది. గురువారం జరిగిన విమెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ ప్రిక్వార్టర్స్‌‌‌‌లో అన్‌‌‌‌సీడెడ్ అష్మితా 21–19, 16–21, 21–12తో పదో ర్యాంకర్‌‌‌‌, మూడోసీడ్‌‌‌‌ బీవెన్‌‌‌‌ జాంగ్‌‌‌‌ (అమెరికా)ను ఓడించి  క్వార్టర్‌‌‌‌ఫైనల్లోకి అడుగుపెట్టింది.   మరో మ్యాచ్‌‌‌‌లో పీవీ సింధు 21–13, 12–21, 21–14తో సిమ్‌‌‌‌ యు జిన్‌‌‌‌ (కొరియా)పై చెమటోడ్చి నెగ్గింది.

విమెన్స్‌‌‌‌ డబుల్స్‌‌‌‌లో పుల్లెల గాయత్రి– ట్రీసా జాలీ– 18–21, 22–20, 14–21తో సంగ్‌‌‌‌ షుయో యున్‌‌‌‌–యు చెన్‌‌‌‌ యు (చైనీస్‌‌‌‌తైపీ) చేతిలో, సిమ్రాన్‌‌‌‌ సింగి–రితికా 17–21, 11–21తో  పియర్లీ టాన్‌‌‌‌–తిన్హా మురళీథరన్‌‌‌‌ (మలేసియా) చేతిలో ఓడారు. మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌లో కిరణ్‌‌‌‌ జార్జ్‌‌‌‌, డబుల్స్‌‌‌‌లో కృష్ణ ప్రసాద్‌‌‌‌–సాయి ప్రతీక్‌‌‌‌,  మిక్స్‌‌‌‌డ్‌‌‌‌ డబుల్స్‌‌‌‌లో సిక్కి రెడ్డి–సుమిత్‌‌‌‌ రెడ్డి  ఇంటిదారి పట్టారు.