మన దేశంలోని ఒకే ఒక్క అగ్నిపర్వతం బద్దలైంది : ఎగసిపడుతున్న ఓల్కనో..!

మన దేశంలోని ఒకే ఒక్క అగ్నిపర్వతం బద్దలైంది : ఎగసిపడుతున్న ఓల్కనో..!

న్యూఢిల్లీ: అండమాన్ దీవుల్లోని బారెన్ ఐలాండ్‎లో ఉన్న భారత దేశంలోనే ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం మళ్లీ నిప్పులు చిమ్ముతోంది. గత కొన్ని నెలలుగా స్తబ్ధుగా ఉన్న ఈ అగ్ని పర్వతం నుంచి 2025, సెప్టెంబర్‎లో స్పల్ప అగ్ని కీలలు ఎగిసిపడ్డట్లు అధికారులు వెల్లడించారు. 2025, సెప్టెంబర్ 13, 20వ తేదీల్లో స్వల్ప విస్పోటనాలు సంభవించినట్లు తెలిపారు అధికారులు.

విస్పోటనాలు స్వల్పమైనవి కావడంతో సమీప ప్రజలకు తక్షణ ముప్పు లేదని చెప్పారు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా అధికారులు అప్రమత్తమయ్యారు. బారెన్ ఐలాండ్ వైపు పర్యాటకులను అనుమతించడం లేదు. బారెన్ ఐలాండ్ కు వచ్చే టూరిస్టులు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. 

అండమాన్ నికోబార్ రాజధాని శ్రీవిజయపురానికి ఈశాన్యంగా 138 కి.మీ దూరంలో ఉన్న బారెన్ ఐలాండ్‏లో ఈ అగ్ని పర్వతం ఉంది. ఇది ఇండియాలోనే కాకుండా దక్షిణాసియాలోనే ఏకైక క్రియాశీల అగ్ని పర్వతం. దాదాపు 8 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఓల్కనో సముద్ర మట్టానికి 354 మీటర్ల ఎత్తులో ఉన్నది. 

ఈ అగ్ని పర్వతానికి 140 కిలో మీటర్ల దూరంలో జనం నివసిస్తున్నారు. 1787లో మొదటిసారిగా ఈ ఓల్కనో విస్ఫోటనం చెందింది. ఆ తర్వాత 1991, 2005, 2017, 2022, 2024లో సల్పంగా విస్పోటనం చెందింది. తాజాగా.. 2025, సెప్టెంబర్‏లో ఈ అగ్ని పర్వతం రెండుసార్లు స్పల్పంగా విస్పోటనం చెందింది. ఈ రెండు విస్పోటనాలు కూడా స్వల్ప ప్రభావమైన కావడంతో ముప్పు తప్పింది.