ముంబై ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి నవీ ముంబైకి.. ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బదిలీ చేయనున్న ఇండిగో, ఎయిర్ ఇండియా 

ముంబై ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి నవీ ముంబైకి.. ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బదిలీ చేయనున్న ఇండిగో, ఎయిర్ ఇండియా 

న్యూఢిల్లీ: ముంబైలోని  ప్రస్తుత ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (సీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంఐఏ) లో రద్దీ తగ్గించేందుకు, డొమెస్టిక్ సర్వీసులు చూసుకుంటున్న టెర్మినల్ 1ను   మెరుగుపరిచేందుకు  కొంత రద్దీని నవీ ముంబై  ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బదిలీ చేయనున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది డిసెంబర్ నుంచి దశల వారీగా కొంత  ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ను బదిలీ చేస్తామని   ఇండిగో, ఎయిర్ ఇండియా గ్రూప్ ప్రకటించాయి. ముంబై ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్  నుంచి  91శాతం విమానాల రాకపోకలు జరుగుతాయి.  

కేవలం 8శాతం నుంచి 9శాతం  మేర ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అంటే దాదాపు 30 నుంచి 50 లక్షల మంది ప్రయాణికులను  మాత్రమే కొత్త నవీ ముంబై ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టుకు మళ్లిస్తున్నారు. ముంబై ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టులోని అంతర్జాతీయ సర్వీసులు, ఎక్కువ దేశీయ విమానాలు నడిచే టెర్మినల్-2  ఎప్పటిలాగే పూర్తి స్థాయిలో కార్యకలాపాలు సాగిస్తుంది. దేశీయ విమానాలు నడిచే టెర్మినల్-1 చాలా పాతబడటంతో దాన్ని ఆధునీకరించి, సామర్థ్యాన్ని 1.5 కోట్ల నుంచి 2 కోట్లకు పెంచడానికి పనులు చేపడుతున్నారు.