కార్గిల్ యోధుడు మేజర్ సంజయ్ కుమార్కు ఇండిగో స్టాఫ్ అరుదైన ఆతిథ్యం..

కార్గిల్ యోధుడు మేజర్ సంజయ్ కుమార్కు ఇండిగో స్టాఫ్ అరుదైన ఆతిథ్యం..

కార్గిల్ యోధుడు.. పరమ వీర్ చక్ర గ్రహీత సుబేదార్ మేజర్ సంజయ్ కుమార్ ను  ఇండిగో స్టాఫ్ అరుదైన ఆతిథ్యం ఇచ్చారు. మేజర్ విమానంలో పూణేకు వెళ్తుండగా.. ఎయిర్‌లైన్ సిబ్బంది ఆయనను విమానంలోకి అత్యంత గౌరవప్రదంగా ఆహ్వానించారు. అంతేకాదు  ఓ గిఫ్ట్ కూడా ఇచ్చారు. కార్గిల్ హీరోతో కలిసి మనం ప్రయాణిస్తున్నామని పైలట్ గర్వంగా ఎనౌన్స్ చేశాడు.  మేజర్ సంజయ్ కుమార్ ను ఇండిగో  స్టాఫ్ ప్రత్యేక గిఫ్ట్ బహుకరించారు. 

ALSO READ:మణిపూర్‌ ఘటనపై మేం చర్చకు సిద్ధం.. కానీ ప్రతిపక్షాలు ఎందుకు సహకరించడం లేదు

1999లో పాకిస్తాన్ తో జరిగిన  కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి పరాక్రమాలను ప్రదర్శించినందుకు భారత ప్రభుత్వం అత్యున్నత సైనిక పురస్కారం పరమవీర చక్రతో గౌరవించింది.  ఆ యుద్ధ సమయంలో శౌర్య పరాక్రమాలు ప్రదర్శించి పరమవీర చక్ర పొందిన 21 మందిలో కార్గిల్ వీరుల్లో సంజయ్ కుమార్ ఒకరు. గౌరవ కెప్టెన్ బానా సింగ్, సుబేదార్ మేజర్ యోగేంద్ర సింగ్ యాదవ్‌తో సహా ఈ అవార్డును అందుకున్న ముగ్గురు సజీవ గ్రహీతలలో సంజయ్ కుమార్ ఉన్నారు. ఈ యుద్దంలో పాకిస్తాన్ పై భారత్ విజయం సాధించింది. దీనికి గుర్తుగా కార్గిల్ విజయ్ దివస్ కూడా జరుపుకుంటున్నాం.