
మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియోపై ప్రతిపక్షాల నిరసనల మధ్య, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఈ విషయంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కానీ ప్రతిపక్షాలు ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నించారు. మణిపూర్ అంశంలో నిజానిజాలు బయటకు రావడమే ముఖ్యమన్నారు.
ALSO READ:కార్గిల్ యోధుడు మేజర్ సంజయ్ కుమార్కు ఇండిగో స్టాఫ్ అరుదైన ఆతిథ్యం..
మణిపూర్ ఘటనతో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వేడెక్కుతున్నాయి. ఈశాన్య రాష్ట్రానికి చెందిన ఈ షాకింగ్ వీడియోపై ప్రతిపక్షాలు చర్చకు డిమాండ్ చేస్తున్నాయి. కాగా తాజాగా ఈ అంశంపై చర్చకు సిద్ధమని కేంద్రం స్పష్టం చేసింది. అంతకుముందు.. సున్నితమైన ఈ అంశంపై మాట్లాడేందుకు కేంద్రం సిద్ధంగా ఉంద రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో స్పష్టం చేశారు.
మణిపూర్ ఘటనపై సభ ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడింది. ఆ తర్వాత హోంమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. మధ్యాహ్నం 2.30 గంటలకు సభ సమావేశమం కాగా.. ఈ అంశంపై చర్చ జరగాలని ఇరుపక్షాల ఎంపీలు కోరుకుంటున్నారని చెప్పారు. అయితే ప్రతిపక్ష ఎంపీలు నిరసన కొనసాగించడంతో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సభను రేపటికి వాయిదా వేశారు.