
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ నాయకురాలు ఇందిరా శోభన్ శనివారం ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఆ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఎమ్మెల్యే సోమనాథ్ భారతి సమక్షంలో పార్టీలో జాయిన్ అయ్యారు. ఆప్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు ఇందిరా శోభన్. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక సామాన్యుల పార్టీ అని..అందుకే ఆ పార్టీలో చేరానని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత రాజకీయ ముఖచిత్రం మారిపోయిందన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ రెండూ ఒకటేనని ఆరోపించారు. షర్మిల పార్టీ తెలంగాణలో సరియైన ప్రభావాన్ని చూపించలేకపోతోందన్నారు. భవిష్యత్తులో చాలా మంది నేతలు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరనున్నారని తెలిపారు.
మరిన్ని వార్తల కోసం...