
అమరావతి: ఏపీ పర్యటనలో ఉన్న ఎన్వీ రమణ.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా శుక్రవారం స్వగ్రామానికి విచ్చేశారు. కృష్ణా జిల్లా వీరుళ్లపాడు మండలం పొన్నవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఏర్పాటుచేసిన ఎండ్లబండిలో సతీసమేతంగా ఊళ్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఢిల్లీకి రాజు అయినా ఓ తల్లికి బిడ్డే అన్నట్లు.. స్వగ్రామానికి రాగానే మామూలు రైతుబిడ్డలా ఆయన ప్రవర్తించిన తీరు అందరినీ ఆకట్టుకుంది.
శనివారం పర్యటనలో భాగంగా ఎన్వీ రమణ దంపతులు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. దర్శనం తరువాత ఆలయ అర్చకులు ఎన్వీ రమణ దంపతులకు వేద ఆశీర్వచనం చేశారు. తరువాత అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. ఏపీ మంత్రి పేర్ని నానితో పాటు, మరికొందరు అధికారులు ఎన్వీ రమణ దంపతులకు ఘన స్వాగతం పలికారు.
#WATCH | Andhra Pradesh: Chief Justice of India N V Ramana, along with his wife, arrived at his native village, Ponnavaram in Veerullapadu Mandal, Krishna district in a bullock cart, earlier today pic.twitter.com/S8oeIgkrfG
— ANI (@ANI) December 24, 2021
For More News..