మస్తుంది.. ఇందిరమ్మ ఇళ్లు నమూనా ఇదే..

మస్తుంది.. ఇందిరమ్మ ఇళ్లు నమూనా ఇదే..

ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే రూ. 5 లక్షల రూపాయల సాయం అదించనుంది ప్రభుత్వం.  ప్రజాపాలన దరఖాస్తుల్లో వివరాలు నమోదు చేసుకున్న అర్హులందరికీ ఈ పథకం వర్తింప చేస్తామన్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంలో చేసిన తప్పులు జరగకుండా, అసలైన అర్హులకే లబ్ధి జరిగేలా ముందుకు వెళ్తోంది రేవంత్ సర్కార్. సొంత జాగాలో ఇల్లు కట్టుకునే వారికి ఉపయోగపడేలా వివిధ రకాల ఇంటి డిజైన్లు, నమూనాలు తయారు చేశారు. తప్పనిసరిగా కిచెన్, టాయిలెట్ ఉండేలా డిజైన్లు రూపొందించారు.

తొలి నమూనాను సింగల్ బెడ్‌రూం ఇల్లుగా రూపొందించారు. ఇంటి నమూనాలో ఓ కిచెన్, బెడ్ రూం విత్ అటాచ్డ్ వాష్ రూం, హాల్, కామన్ బాత్ రూం, ఇంటి పైకి వెళ్లడానికి మెట్లు, ఇంటి ముందు మొక్కలు పెంచేందుకు బాల్ కనీ, బైక్ పార్కింగ్ కోసం జాగా, ఇంటి చుట్టూ కాంపౌండ్ వాల్ వంటి సదుపాయాలు కల్పించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పథకానికి మొత్తం 82 లక్షల దరఖాస్తులు వచ్చాయి. దశల వారీగా రాష్ట్రంలో ఇండ్లు లేదని పేదలకు ఈ పథకం వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.  

 త్వరలో లోక్ సభ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడే అవకాశం ఉన్నందున ఈ లోపే మరిన్ని గ్యారంటీలు అమలు చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. వీటిలో ముఖ్యంగా మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా మహిళలకు 2 వేల 500 రూపాయలు, రైతులకు రుణమాఫీ వంటివి ఉన్నాయి. ఈ రెండు హామీలు అమలు చేయడమే తమ ప్రాధాన్యమని అంటోంది రాష్ట్ర ప్రభుత్వం.