
అర్హులైన జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ నెలాఖరులోగా ప్రెస్ అకాడమీ భవనాన్ని ప్రారంభిస్తామన్నారు. ఇవాళ నాంపల్లి ప్రెస్ అకాడమీ కార్యాలయంలో వృత్తి నిర్వహణలో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలైన జర్నలిస్టులకు, వృత్తి నిర్వహణలో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు అత్యంత ప్రాధాన్యతస్తామన్నారు.
విడతల వారీగా ప్రభుత్వం మంజూరు చేసిన రూ.42 కోట్లను ఫీక్సడ్ డిపాజిట్ చేసి, దానిపై వచ్చే వడ్డీని జర్నలిస్టుల సంక్షేమం కోసం అకాడమి ఖర్చు చేస్తామన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి ఫిక్డ్స్డిపాజిట్ పై వచ్చిన వడ్డీ ఆధారంగా ఇప్పటివరకు రూ.22 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సమాజంలో జర్నలిస్టు వృత్తి అత్యంత కీలకమైనదన్నారు.
తమ ప్రాణాలను లెక్క చేయకుండా జర్నలిస్టులు సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారని తెలిపారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ .. ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి నిధులను పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి పాల్గొన్నారు.
నకిరేకల్‌లో భారత్ ఆర్మీకి మద్దతుగా ర్యాలీ
నల్గొండ జిల్లా నకిరేకల్‌లో ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు . ఈ మేరకు విద్యార్థులు, పోలీసులతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని ప్రభుత్వ ఆసుపత్రి నుండి మెయిన్ సెంటర్ వరకు భారీ ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేలు, ఎమ్మెల్సీలు నెలికంటి సత్యం, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి , జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ తదిరులు పాల్గొన్నారు.