ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో సాగుతోంది. సోమవారం మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి, మరిపెడ మండలాల్లో ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రునాయక్ మహిళలకు చీరలను అందజేశారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్క మురళీనాయక్ నెల్లికుదురు, కేసముద్రం మండలాల్లో, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో మహిళలకు చీరలు అందజేశారు.
రికాల పంచాయతీ సుడిబాకతోగు గ్రామంలో పాయం చందు– రమ్య దంపతుల ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి ఆయన హాజరయ్యారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెంకటాపురం గ్రామంలో, వరంగల్ జిల్లా నల్లబెల్లి, దుగ్గొండి మండలాల్లోని ఆయా గ్రామాల్లో స్థానిక నాయకులు, మహిళా సామాఖ్య అధ్యక్షురాళ్లు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.- వెలుగు, నెట్వర్క్
