ముగిసిన ఇండో-జపాన్ ఆర్ట్ ఎగ్జిబిషన్

ముగిసిన ఇండో-జపాన్ ఆర్ట్ ఎగ్జిబిషన్

మాదాపూర్, వెలుగు: మాదాపూర్ లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో నిర్వహిస్తున్న ఇండో‌‌-జపాన్ ఆర్ట్ ఎగ్జిబిషన్ గురువారం ముగిసింది. మూడు రోజుల పాటు కొనసాగిన ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ కు ఇప్పటివరకు వేల మంది విజిటర్స్​తరలివచ్చి పెయింటింగ్స్ తిలకించారు. ప్రముఖ ఆర్టిస్ట్ వెంకట్ గడ్డం, జపాన్ కు చెందిన ఆర్టిస్ట్ టకాయమా హీరోకో వేసిన పెయింటింగ్స్ ఆలోచింపజేశాయి. ముగింపు కార్యక్రమానికి మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు.