ముంబై: కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డ్ (సీపీపీ ఇన్వెస్ట్‌మెంట్స్), ఇండోస్పేస్ కలిసి ఏర్పాటు చేసిన ఇండోస్పేస్ కోర్ మంగళవారం రూ.మూడు వేల కోట్ల విలువైన ఆరు ఇండస్ట్రియల్ లాజిస్టిక్స్ పార్కులను కొన్నట్టు ప్రకటించింది. ఇవి బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై, పూణే వంటి ముఖ్యమైన లాజిస్టిక్స్ మార్కెట్లలో ఉన్నాయి.
మొత్తం 380 ఎకరాలలో విస్తరించాయి. తొమ్మిది మిలియన్ చదరపు అడుగులను లీజుకు ఇవ్వవచ్చని ఇండోస్పేస్ తెలిపింది. ఈ జాయింట్ వెంచర్లో సీపీపీ ఇన్వెస్ట్మెంట్స్కు 93 శాతం వాటా ఉంది. ఈ కొనుగోలుకు సిపీపీ రూ.1,400 కోట్లను కేటాయిస్తుంది. కొత్త పార్కుల వల్ల ఇండోస్పేస్ కోర్ పోర్ట్‌ఫోలియో 22 మిలియన్ చదరపు అడుగులకు పెరుగుతుంది.
