మహిళా ఫైటర్ పైలట్ల ప్రవేశం శాశ్వతం

మహిళా ఫైటర్ పైలట్ల ప్రవేశం శాశ్వతం

ఎయిర్‎ఫోర్స్‎లో మహిళా ఫైటర్ పైలట్ల ప్రవేశాన్ని శాశ్వతం చేయాలని రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ నిర్ణయం భారత ‘నారీ శక్తి’ సామర్థ్యానికి నిదర్శనమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. భారత వైమానిక దళంలో మహిళా ఫైటర్ పైలట్‌ల ప్రవేశానికి సంబంధించిన ప్రయోగాత్మక పథకాన్ని శాశ్వతంగా మార్చాలని రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. భారత ‘నారీ శక్తి’ సామర్థ్యానికి, మహిళా సాధికారత పట్ల ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్న నిబద్ధతకు ఈ నిర్ణయం నిదర్శనమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

‘భారత వైమానిక దళంలో మహిళా ఫైటర్ పైలట్‌ల ఇండక్షన్ కోసం ప్రయోగాత్మక పథకాన్ని శాశ్వత పథకంగా మార్చాలని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నిర్ణయించింది. ఇది భారతదేశం యొక్క ‘నారీ శక్తి’ యొక్క సామర్థ్యానికి మరియు మహిళా సాధికారత పట్ల మన ప్రధానమంత్రి నరేంద్రమోడీ యొక్క నిబద్ధతకు నిదర్శనం’ అని రాజ్‌నాథ్ ట్విట్ చేశారు.

నేషనల్ డిఫెన్స్ అకాడమీలో పురుషుల కోసం మూడు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. అదే తరహాలో మహిళల రిక్రూట్‌మెంట్ కోసం సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసిన నెలరోజుల తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. భారత వైమానిక దళానికి చెందిన ఫ్లయింగ్ ఆఫీసర్ అవనీ చతుర్వేది 2018లో ఒంటరిగా యుద్ధ విమానాన్ని నడిపిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు.