ఇండస్ఇండ్ నిప్పన్ లైఫ్ లాభం రూ.248 కోట్లు

ఇండస్ఇండ్ నిప్పన్ లైఫ్ లాభం రూ.248 కోట్లు

హైదరాబాద్​, వెలుగు: ఇండస్ఇండ్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ 2026 ఆర్థిక సంవత్సరంలో నికరలాభం 15 శాతం పెరిగి రూ.248 కోట్లకు చేరింది. మొత్తం ప్రీమియం 6 శాతం పెరిగి రూ.6,051 కోట్లకు చేరగా, న్యూ బిజినెస్ ప్రీమియం 18 శాతం వృద్ధితో రూ.1,475 కోట్లకు పెరిగింది. కంపెనీ అసెట్స్ అండర్ మేనేజ్​మెంట్​ (ఏయూఎం) రూ.40,214 కోట్లకు చేరింది. 

ఈ సంస్థ 98.98 శాతం క్లెయిమ్స్ సెటిల్మెంట్ నిష్పత్తిని, 218 శాతం సాల్వెన్సీ నిష్పత్తిని సాధించింది. వాటాదారుల కోసం రూ.423 కోట్ల బోనసులను ప్రకటించింది. దీనివల్ల 4.9 లక్షల వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుందని కంపెనీ తెలిపింది.