పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన ప్రారంభం 

 పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన ప్రారంభం 

హైదరాబాద్, వెలుగు : దక్షిణ భారతదేశంలో అతిపెద్ద పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శుక్రవారం ప్రారంభమయింది. ఈ బీ2బీ ఇండస్ట్రియల్ మెషినరీ, ఇంజనీరింగ్ ఎగ్జిబిషన్ 23 తేదీ వరకు కొనసాగుతుంది. ఇక్కడ మెషీన్ టూల్స్, ఆటోమేషన్, రోబోటిక్స్,  ఎలక్ట్రికల్,  ఇంజినీరింగ్ ఉత్పత్తులు, సేవలు, భారీ, తేలిక పాటి యంత్రాలు, పరికరాలు, సాధనాలు,   సాంకేతిక పరికరాలు, ఉత్పత్తులు

ఇంజనీరింగ్ సాధనాల ప్రదర్శన ఉంటుంది. అత్యాధునిక టెక్నాలజీలు, గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్నోవేషన్లు, ఆధునిక పరిష్కారాలతో సహా విస్తృతమైన పారిశ్రామిక అప్లికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఆవిష్కరించడం దీని ముఖ్య ఉద్దేశం. వీటిలో కొన్ని భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మొదటిసారిగా పరిచయం కానున్నాయి. పలు రాష్ట్రాల నుంచి 18,000 మంది సందర్శకులు వచ్చే అవకాశం ఉంది.