యూఎస్ లో ద్రవ్యోల్బణం పెరిగింది నిజమే: నెటిజన్

యూఎస్ లో ద్రవ్యోల్బణం పెరిగింది నిజమే: నెటిజన్

యూఎస్ లో ద్రవ్యోల్బణం పెరిగింది నిజమేనని ఓ ట్విట్టర్ యూజర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ద్రవ్యోల్బణం వల్ల చాలా ఇబ్బందులు అనుభవిస్తున్నారని చెప్తూ.. ఓ వీడియోను కూడా షేర్ చేశారు. వాల్ స్ట్రీట్ సిల్వర్ పేరుతో పోస్ట్ అయిన ఈ వీడియోలో టాయిలెట్ రోల్స్, పాలు, పిండి, జ్యూస్‌లు, డియోడరెంట్‌తో సహా నిత్యావసర వస్తువులను చూపిస్తూ... వాటి ధరలు ఎంతగా పెరిగాయో తెలియజేశారు. జనవరి 2న పోస్ట్ చేసిన ఈ వీడియోకు ఇప్పటికే 1మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. దాంతో పాటు పలువురు నెటిజన్లు భిన్నంగా కామెంట్ చేశారు.

తాము ఇంతకుముందు సరుకుల కోసం 80 డాలర్లు వెచ్చించేవాడినని, ఇప్పుడు 100 డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తోందని ఓ యూజర్ ఈ వీడియోకు కామెంట్ చేశారు. తాము ఖర్చుల విషయంలో చాలా కఠినంగా ఉంటామని, దాని కోసం ఓ రికార్డు కూడా మెయింటైన్ చేస్తు్న్నామని ఓ మహిళ రాసుకొచ్చారు.  తాము మార్చి 2022 నుండి ప్రతి నెలా కిరాణా సామాగ్రిపై 40% ఖర్చు చేస్తున్నామని చెప్పారు.