ఇవాళ హస్తినకు సీఎం కేసీఆర్?

ఇవాళ హస్తినకు సీఎం కేసీఆర్?

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం. ఈ పర్యటనలో కేంద్ర బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా ఉండే పార్టీల నేతల్ని ఆయన కలుస్తారని తెలుస్తోంది. ముఖ్యంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో టీఆర్ఎస్ చీఫ్ భేటీ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్డీఏయేతర ముఖ్యమంత్రులతో కేసీఆర్ వరుస భేటీల నేపథ్యంలో.. ఢిల్లీ టూర్ ఆసక్తిని సంతరించుకుంది. కాగా, కేంద్ర సర్కారుపై కేసీఆర్ విమర్శల జోరును పెంచారు. దేశ రాజకీయాల్లో ముఖ్యపాత్ర పోషిస్తానని రీసెంట్ గా కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతోపాటు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ను కేసీఆర్ కలిశారు. గతంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, కేరళ సీఎం పినరయి విజయన్ తో కూడా కేసీఆర్ సమావేశం నిర్వహించారు. కేసీఆర్ పోరాటానికి మాజీ ప్రధాని దేవెగౌడ మద్దతు తెలిపారు. త్వరలోనే బెంగళూరు వస్తానని దేవెగౌడతో కేసీఆర్ అన్నారు. 

మరిన్ని వార్తల కోసం:

కీవ్‌లో వీకెండ్ కర్ఫ్యూ ఎత్తేసిన అధికారులు

రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై కేసీఆర్, పీకే చర్చలు