ఇన్ఫోసిస్‌‌కు రూ.4,321 కోట్ల లాభం

ఇన్ఫోసిస్‌‌కు రూ.4,321 కోట్ల లాభం

క్యూ4లో ఆరు శాతం పెరుగుదల
మొత్తం ఆదాయం రూ.23,267 కోట్లు
ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఉండబోవని ప్రకటన

న్యూఢిల్లీ: ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో క్వార్ట‌ర్ లో రూ.4,321 కోట్ల లాభం సంపాదించింది. గత ఏడాది క్యూ4 లాభం రూ.4,074 కోట్లతో పోలిస్తే ఇది 6.10 శాతం ఎక్కువ. ఇన్ఫోసిస్‌‌కు ఈ క్వార్ట‌ర్ లో రూ.4,382 కోట్ల లాభం వస్తుందన్న ఎనలిస్టుల అంచనాలకు దగ్గరగా ఫలితాలు వచ్చాయి. మొత్తం ఆదాయం ఎనిమిది శాతం పెరిగి రూ.23,267 కోట్లకు చేరుకుంది. అయితే కరోనా క్రైసిస్‌తో ఒడిదుడుకులు పెరిగినందున, ప్రస్తు పరిస్థితుల్లో2021 ఆర్థికర్థి సంవత్సరానికి  గైడెన్స్‌ విడుదల చేయడం సాధ్యంకాదని బీఎస్‌ఈ ఫైలింగ్‌లో పేర్కొంది.

‘‘2020 ఆర్థికర్థి సంవత్సరంలో మేం 9.8 శాతం గ్రోత్‌ సాధించాం. ఆపరేటింగ్‌ మార్జిన్ 21.3 శాతం పెరిగింది. సమీప భవిష్యత్‌లో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. మరిన్నినాణ్యమైన సేవలు అందించడం, మా భాగస్వాములతో కలిపి పనిచేయడం ద్వారా ఇంకా బలమైన కంపెనీగా ఎదుగుతాం’’ అని కంపెనీ సీఈఓ, ఎండీ సలీల్‌ పరేఖ్‌ వివరించారు. ఈ సందర్భంగా కంపెనీ షేరుకు రూ.9.50 చొప్పున డివిడెండ్‌ ప్రకటించింది. అయితే కరోనా ఇబ్బందుల కారణంగా ప్రమోషన్లను , జీతాల పెంపును నిలిపివేసినట్టు తెలిపింది.

లిక్విడిటీకి ఇబ్బందిలేదు..

కంపెనీ బ్యాలన్స్‌ షీట్‌ పటిష్టంగా ఉంది. ప్రస్తుతం ఇన్ఫోసిస్‌ దగ్గర 3.6 బిలియన్ డాలర్ల నగదు ఉంది. ఫలితంగా లిక్విడిటీకి ఢోకా ఉండబోదని చీఫ్‌ ఫైనాన్షియన్షి ల్‌ ఆఫీసర్‌ నీలాంజన్‌ రాయ్ అన్నారు. గత నెల 31నాటికి కంపెనీ దగ్గర రూ.27,300 కోట్ల నగదు ఉంది. జనవరి–మార్చి మధ్య1.65 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్‌ కుదుర్చుకుంది. ఉద్యోగుల రాజీనామాల రేటు (అట్రిషన్‌ రేటు) గత ఆర్థికర్థి సంవత్సరంలో 20.4 శాతం ఉండగా, తాజా క్వార్ట‌ర్ లో ఇది 20.7 శాతం రికార్డయింది. గత మార్చి 31నాటికి కంపెనీలో 2.28 లక్షల మంది పనిచేస్తుండగా, గత నెల 31నాటికి వీరి సంఖ్య2.42 లక్షలకు పెరిగింది. కరోనా వల్ల ఇబ్బం దులు ఉన్నప్పటికీ, గతంలో జాబ్ ఆఫర్లు ఇచ్చిన వారిని ఉద్యోగాల్లోకి తీసుకుంటామని కంపెనీ హామీ ఇచ్చింది. ఉద్యోగులను తొలగించబోమని స్పష్టం చేసింది.