
- 2026లోపు వస్తాయన్న క్రిసిల్ రేటింగ్స్
ముంబై: మనదేశంలో మౌలిక సదుపాయాలు, రియల్టీ రంగాలకు 2026 మార్చి వరకు రూ. 15 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని దేశీయ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ మంగళవారం తెలిపింది. దీని ప్రకారం... పెట్టుబడుల వల్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 50 గిగావాట్లు పెరుగుతుంది. ఇన్‌ఫ్రా, రియల్ ఎస్టేట్ ద్వారా 25,000 కిలోమీటర్ల రోడ్లు నిర్మాణమవుతాయి.
మౌలిక సదుపాయాలు, -- పునరుత్పాదక ఇంధనం, రోడ్లు వంటి రంగాల్లో 2025, 2026 ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడులు 38 శాతం వృద్ధి చెందుతాయి. ఇంధన రంగంలో పెట్టుబడుల వల్ల మరింత గ్రీన్ పవర్ అందుబాటులోకి వస్తుంది. రియల్టీ పెట్టుబడులు నివాస, వాణిజ్య ప్రాజెక్టులపై ఉంటాయి. రాబోయే రెండు ఆర్థిక సంవత్సరాల్లో సంవత్సరానికి 12,500 కిలోమీటర్ల పొడవైన రోడ్లు అందుబాటులోకి రావొచ్చని క్రిసిల్వెల్లడించింది.