రోస్టర్ పాయింట్ల రద్దుతో మహిళా అభ్యర్థులకు అన్యాయం: ఎమ్మెల్సీ కవిత

రోస్టర్ పాయింట్ల రద్దుతో మహిళా అభ్యర్థులకు అన్యాయం: ఎమ్మెల్సీ కవిత
  • జీవో 3ని వెంటనే వెనక్కి తీసుకోవాలి
  • బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  కవిత డిమాండ్

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగావకాశాల్లో రోస్టర్ పాయింట్లు లేని హారిజంటల్ రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దారుణమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నియామకాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఆడబిడ్డలకు నష్టం చేసే జీవో 3ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

జీవో 3ను వెనక్కి తీసుకునేలా సీఎం రేవంత్ రెడ్డిని ఆదేశించాలంటూ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సోమవారం లేఖ రాశారు.  బంజారాహిల్స్‌‌‌‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో ఇప్పటిదాకా  మహిళలకు రోస్టర్ పాయింట్లతో కూడిన హారిజంటల్ రిజర్వేషన్లు అమలవుతున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన జీవో 3తో 100 ఉద్యోగాల్లో మహిళలకు 33 ఉద్యోగాలు ఇవ్వాలన్న నిబంధన అమలు కాకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.