'ఇన్నర్ కాళి' ఆర్ట్ గ్యాలరీ ప్రారంభించిన వివేక్ వెంకటస్వామి

'ఇన్నర్ కాళి' ఆర్ట్ గ్యాలరీ ప్రారంభించిన వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్ ఆర్టిస్ట్, ఫ్యాషన్ డిజైనర్ వెంకట్ గడ్డం బంజారాహిల్స్ కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన లేటెస్ట్ ఆర్ట్ షో అందరినీ ఆకట్టుకుంటోంది. 'ఇన్నర్ కాళి' పేరుతో జరుగుతున్న ఆర్ట్ అండ్ ఫ్యాషన్‌ షోకి ముఖ్య అతిథిగా బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఆర్ట్ గ్యాలరీలో ఉన్న కళాకృతులను పరిశీలించారు. అక్కడకు వచ్చిన అతిథులు, సందర్శకులతో ముచ్చటించారు. 

షో ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడిన వివేక్ వెంకటస్వామి.. కళాకృతులు ఎంతో బాగున్నాయని అన్నారు. వాటిని ఇంత అందంగా తీర్చిదిద్దిన వెంకట్ కు బెస్ట్ విషెస్ చెప్పారు. కాగా, ఆర్ట్ గ్యాలరీలో కాన్వాస్‌పై యాక్రిలిక్ 36 పెయింటింగ్స్, పెన్ ఆన్ పేపర్ ఇలస్ట్రేషన్‌లు, డిజిటల్ కోల్లెజ్‌లు, మ్యూరల్ ప్రొజెక్షన్, పోయెట్రీ, ఫ్యాషన్ ఇన్‌స్టాలేషన్‌లతో సహా వెంకట్ గడ్డం తన తాజా ఆర్ట్ వర్క్స్ ను ప్రదర్శిస్తున్నారు. షో కు వచ్చి తనను సపోర్ట్ చేసిన అందరికి వెంకట్ ధన్యావాదాలు తెలిపారు.