ఐపీఓకు రెడీ అవుతున్న ఇనాక్స్ గ్రీన్

ఐపీఓకు రెడీ అవుతున్న ఇనాక్స్ గ్రీన్

న్యూఢిల్లీ:  ఇనాక్స్ విండ్  అనుబంధ సంస్థ ఇనాక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా రూ. 740 కోట్లను సమీకరించడానికి క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటరీ సెబీకి మరోసారి డాక్యుమెంట్లను అందజేసింది.  డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్​హెచ్​పీ) ప్రకారం, ఐపీఓలో తాజాగా రూ. 370 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు.  ప్రమోటర్ ఇనాక్స్ విండ్ ద్వారా రూ. 370 కోట్ల విలువైన ఆఫర్- ఫర్ -సేల్ ఉంటుంది. కంపెనీ ప్రీ- ఐపిఓ ప్లేస్‌‌మెంట్‌‌ ద్వారా కూడా డబ్బు సేకరించే అవకాశాలు ఉంటాయి. ఇదే జరిగితే ఇష్యూ సైజు తగ్గుతుంది. ఇష్యూ ద్వారా వచ్చే ఆదాయాన్ని అప్పుల చెల్లింపులకు  సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. ఇనాక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్ విండ్ ఫామ్ ప్రాజెక్ట్‌‌లకు దీర్ఘకాలిక ఆపరేషన్,  మెయింటెనెన్స్ (ఓ&ఎం) సేవలను అందిస్తోంది. ఈ కంపెనీ తన ఐపిఓ కోసం డిఆర్‌‌హెచ్‌‌పిని ఫిబ్రవరిలోనే సెబీకి దాఖలు చేసినా, ఏప్రిల్​లో వెనక్కి తీసుకుంది.