
న్యూఢిల్లీ: కేరళ సీఎం పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్ ఐటీ కంపెనీపై కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విచారణకు ఆదేశించింది. ఓ ప్రైవేట్ కంపెనీకి, వీణాకు చెందిన ఐటీ సంస్థ మధ్య అక్రమ లావాదేవీలు జరిగినట్టు అందిన ఫిర్యాదుల ఆధారంగా ఆ శాఖ విచారణకు ఆర్డర్స్జారీ చేసింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ కెంపెనీ.. సీఎం కుమార్తె వీణాకు చెందిన ఐటీ సంస్థకు 2017 నుంచి 2020 మధ్య రూ.1.72 కోట్లు చెల్లింపులు జరిపినట్టు ఆరోపణలు వచ్చాయి.
కన్సల్టెన్సీ, సాఫ్ట్‌వేర్ సపోర్టు సర్వీసెస్ కోసం మినరల్స్ సంస్థ.. వీణా ఐటీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. కానీ, వీణా కంపెనీ.. మినరల్స్ సంస్థకు ఎటువంటి సర్వీసెస్అందించలేదు. దీంతో ఈ రెండు సంస్థల మధ్య అక్రమ లావాదేవీలు జరిగినట్టు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుర్తించి విచారణకు ఆదేశించింది.