లాక్‌డౌన్‌ వ్యూహంపై రాహుల్ గాంధీ సీరియస్‌

లాక్‌డౌన్‌ వ్యూహంపై రాహుల్ గాంధీ సీరియస్‌

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో మహమ్మారిని ఎదుర్కోవడానికి లాక్‌డౌన్ వ్యూహాన్ని అమలు చేసిన మోడీ గవర్నమెంట్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. లాక్‌డౌన్‌లోని నాలుగు ఫేజ్‌ల్లో దశల వారీగా కరోనా కేసులు పెరుగుతున్న తీరును చూయించే గ్రాఫ్స్‌ను ట్విట్టర్‌‌లో పోస్ట్ చేసిన రాహుల్.. ప్రభుత్వ నిర్ణయాలపై మండిపడ్డారు. పదే పదే పిచ్చితనంతో ఒకే పనిని చేస్తూ డిఫరెంట్ రిజల్ట్స్‌ను ఆశిస్తున్నారని ఆ పోస్ట్‌కు రాహుల్ కొటేషన్‌ను జత చేశారు.

మార్చి 24న కేంద్ర సర్కార్ తొలి దశ లాక్‌డౌన్ విధించినప్పుడు ఇండియా వ్యాప్తంగా కేవలం 500 కరోనా పాజిటివ్‌ కేసులు మాత్రమే నమోదయ్యాయి. రెండు నెలల లాక్‌డౌన్‌ తర్వాత దేశంలో 3 లక్షల కరోనా కేసులు నమోదవ్వగా.. 8,800 మంది పేషెంట్స్‌ వైరస్ బారిన పడి మృతి చెందారు. ప్రస్తుతం ప్రతి రోజూ సగటున సుమారు 10 వేల కేసులు నమోదవుతున్నాయి. కేంద్రం అన్‌లాక్‌ 1.0 పేరుతో మెళ్లిగా లాక్‌డౌన్‌ నిబంధనలను సడలిస్తోంది. అందులో భాగంగా ఇంటర్ స్టేట్ లెవల్ ఫ్లయిట్స్ సేవలను తిరిగి ప్రారంభించింది. అలాగే రెస్టారెంట్స్, మాల్స్, షాప్స్, ఆలయాలు, చర్చిలు, గురుద్వారాలు, మసీదుల్లాంటి ప్రార్థనాలయాలను తిరిగి తెరవడానికి అనుమతిని ఇచ్చింది.