కాశీబుగ్గ, వెలుగు : హన్మకొండ సిటీలోని ఎర్రట్టు, భీమారంలోని ఐశాట్ ఇన్స్స్పైర్ జూనియర్ కాలేజీలో స్కాలర్షిప్ కమ్ అడ్మిషన్ టెస్ట్–2026ను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ తీగల భరత్ గౌడ్ మాట్లాడుతూ పరీక్షలో ప్రతిభ కనబర్చిన 20 మంది విద్యార్థులను ఎంపిక చేశామన్నారు. ఎంపికైన వారికి రెండేండ్లపాటు పూర్తిగా ఉచిత విద్యను స్కాలర్షిప్ రూపంలో అందిస్తామని తెలిపారు.
పరీక్షకు హాజరైన ప్రతి విద్యార్థికి 40 శాతం ఫీజు రాయితీ వర్తింపజేస్తామని పేర్కొన్నారు. మొత్తం 200 మంది విద్యార్థులకు టెస్ట్నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రామ్ రెడ్డి, డైరెక్టర్లు రాజ్ కుమార్, మమత కుమారి, శివ, లెక్చరర్స్, స్టూడెంట్స్ పాల్గొన్నారు.
