హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఓ దుర్మార్గుడు గలీజ్ పని చేశాడు. యువతులకు రెంట్ కు ఇళ్లు అద్దెకు ఇచ్చిన సమీర్ అనే చెత్తగాడు..అమ్మాయిలకు తెలియకుండా రహస్యంగా కెమెరాలు ఏర్పాటు చేశారు. యువతులు ఉండే గదిలో కరెంట్ మీటర్ బాక్స్ పెడుతున్నట్లు చెప్పి..వారి బెడ్ రూంలో సీక్రెట్ కెమెరా ఏర్పాటు చేశాడు. ఈ కెమెరా ద్వారా యువతులు బట్టలు మార్చుకునే దృశ్యాలు రికార్డయ్యాయి.
కరెంట్ మీటర్ ఏర్పాటుపై ఓ యువతికి అనుమానం వచ్చింది. వెంటనే చెక్ చేయడంతో అందులో కెమెరా ఉన్నట్లు గుర్తించింది. దీంతో యువతి పోలీసులను ఆశ్రయించి.. నిందుతుడిపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు సమీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
