నల్గొండ జిల్లా త్రిపురారం మండలం బొర్రాయిపాలెంలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన

నల్గొండ జిల్లా త్రిపురారం మండలం బొర్రాయిపాలెంలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన

హాలియా, వెలుగు: నల్గొండ జిల్లా త్రిపురారం మండలం బొర్రాయిపాలెంలోని వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో లక్ష్మీనరసింహ స్వామి విగ్రహ ప్రతిష్ఠతో పాటు 16 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమం త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు.

మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి, ఎమ్మెల్యే జై వీర్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఎంసీ కోటిరెడ్డి, కేతావత్ శంకర్ నాయక్ పాల్గొని పూజలు చేశారు. అనంతరం హాలియా పట్టణంలోని రామాలయంలో జరిగిన శ్రీరాముడి పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి, ఆలయ చైర్మన్ మేడెపల్లి మోహన్ రావు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.