రాహుల్ దేశాన్ని విభజించాలని చూస్తున్నారు

రాహుల్ దేశాన్ని విభజించాలని చూస్తున్నారు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. రైతుల ఉద్యమాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తే దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తామని రాహుల్ గాంధీ అనడంపై ఆమె ఫైర్ అయ్యారు. దేశ ప్రజలపై రాహుల్ గాంధీ యుద్ధం ప్రకటించారని చెప్పారు. రైతుల ఉద్యమం విషయంలో ప్రధాని మోడీ మద్దతుగా నిలవకపోతే దేశంలోని సిటీలు తగులబడతాయంటూ రాహుల్ చెప్పడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘మన ప్రజాస్వామ్య చరిత్రలో ఇప్పటివరకు ఏ నేత కూడా హింసను ప్రేరేపించలేదు. శాంతికి బదులు హింసకు ప్రేరేపించడం ఏంటి? రాహుల్ గాంధీ శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తున్నారు. మన జాతీయ పతాకాన్ని అగౌరవపర్చడంతోపాటు దేశాన్ని విభజించాలని చూస్తున్నారు’ అని స్మృతి ఆరోపించారు. రిపబ్లిక్ డే నాడు ఎర్రకోటలో జరిగిన హింసలో గాయపడిన పోలీసుల గురించి రాహుల్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఆమె అన్నారు.