బిటెక్, డిప్లొమా చేసినోళ్ళకు అప్రెంటీస్ పోస్టులు.. ఎలాంటి పరీక్షా లేదు.. డైరెక్ట్ జాబ్..

బిటెక్, డిప్లొమా చేసినోళ్ళకు అప్రెంటీస్ పోస్టులు.. ఎలాంటి పరీక్షా లేదు.. డైరెక్ట్ జాబ్..

ఇనుస్ట్రుమెంటేషన్ లిమిటెడ్ (ఐఎల్) అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 19.

ఖాళీలు: 81.

విభాగాల వారీగా ఖాళీలు: ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ 37 (మెకానికల్ 25, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ 02, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ 01,  ఎలక్ట్రానిక్స్ & ఇనుస్ట్రుమెంటేషన్ 01, ఇనుస్ట్రుమెంటేషన్  & కంట్రోల్ 02, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 02, కంప్యూటర్ సైన్స్ 02, సివిల్ 01) డిప్లొమా అప్రెంటీస్ 44 ( మెకానికల్ 25, ఇనుస్ట్రుమెంటేషన్ 15, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ 02, సివిల్ 02) 

ఎలిజిబిలిటీ
ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బి.టెక్./ బీఈలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

డిప్లొమా అప్రెంటీస్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. 

అప్లికేషన్ ప్రారంభం: జనవరి 13. 

లాస్ట్ డేట్: ఫిబ్రవరి 19. 

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్​లిస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు www.ilpgt.com వెబ్​సైట్​ను సందర్శించండి.