
- సరైన భోజనాల ఏర్పాట్లు చేయని ఎన్నికల అధికారులు
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం లేమురు నిషిత్ కాలేజీలో కౌంటింగ్ వసతులు సరిగా లేకపోవడంతో ఎన్నికల సిబ్బంది, పోలీసులు ఇబ్బందిపడ్డారు. కౌంటింగ్ సెంటర్ దగ్గర స్థానిక ఎన్నికల అధికారులు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో.. భోజనాలకు ఇబ్బంది పడ్డారు. నిర్వహణ , ఏర్పాట్లు సరిగా లేవని ఆగ్రహం వ్యక్తంచేశారు. సరైన భోజన ఏర్పాట్లు కూడా చేయలేదన్నారు. కర్రీలు లేకపోవడంతో… కారం పొడి, తొక్కులు కలుపుకుని భోజనం పూర్తిచేశారు సిబ్బంది,పోలీసులు.