భైంసా/బాసర, వెలుగు : బాసర ట్రిపుల్ ఐటీలో చోటుచేసుకున్న ఇన్సూరెన్స్ స్కాం దుమారం రేపుతోంది. ప్రతి అకడమిక్ఇయర్ట్రిపుల్ఐటీలో అడ్మిషన్ పొందే స్టూడెంట్స్ నుంచి ఇన్సూరెన్స్ ప్రీమియం రూ. 700 వసూలు చేస్తున్నారు. ఇలా వసూలు చేసిన డబ్బులను ఆరేండ్లుగా ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లించడం లేదు. ఇటీవల ఓ స్టూడెంట్అనారోగ్యంతో చనిపోవడంతో ఈ స్కాం బయటపడింది.
బాసర వర్సిటీలో ఏటా 1,500 మంది స్టూడెంట్ల నుంచి రూ. 10.50 లక్షల వరకు వసూలవుతోంది. ఇలా 2016 నుంచి లెక్క కడితే ఇప్పటివరకు సుమారు రూ. 60 లక్షలకు పైగా లెక్క తేలడం లేదు. దీనిపై వీసీ వెంకటరమణ స్పందిస్తూ 2021-–22 విద్యా సంవత్సరానికి సంబంధించి స్టూడెంట్ల నుంచి వసూలు చేసిన డబ్బులు ట్రిపుల్ఐటీ బ్యాంకు ఖాతాలో ఉన్నాయని, కొవిడ్ కారణంగా ఇన్సూరెన్స్ కంపెనీలతో కాంట్రాక్టు కుదుర్చుకోలేకపోయామని చెప్పారు. రెండు మూడు రోజుల్లో కంపెనీలతో చర్చించి విద్యార్థులకు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని వర్తింపజేస్తామని చెప్పారు.
