ఇంటిగ్రేటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్కెట్లు కొసెళ్లలే..  GHMC ఏండ్లుగా సాగుతున్న నిర్మాణ పనులు 

ఇంటిగ్రేటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్కెట్లు కొసెళ్లలే..  GHMC ఏండ్లుగా సాగుతున్న నిర్మాణ పనులు 

గోదావరిఖని, వెలుగు: రామగుండం బల్దియా పరిధిలోని విఠల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేపట్టిన ఇంటిగ్రేటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నిర్మాణ పనులు కొసెల్తలేవు. పనుల విషయంలో ఆఫీసర్లు నిర్లక్ష్యంగా ఉండడంతో కోట్లాది రూపాయలు కేటాయించినా రోడ్లపైనే వ్యాపారాలు కొనసాగించాల్సిన పరిస్థితి. 

8 ఏండ్ల కింద పనులు ప్రారంభం...

బల్దియా పరిధిలోని గోదావరిఖనిలోని మేదరిబస్తీలో పెద్ద మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంది. కాగా అన్ని ప్రాంతాలకు అనుకూలంగా ఉండేలా, పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ఒకేచోట హోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రిటైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కూరగాయలు, చేపలు, మాంసం, పూలు, పండ్లు ఒక్కచోటే దొరికేలా ఇంటిగ్రేటెడ్​ మార్కెట్ల నిర్మాణానికి నిర్ణయించారు. ఇందులో భాగంగా 2016లో విఠల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీ సేవా సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పక్కనున్న ఖాళీ స్థలంలో నిర్మించేందుకు సీఎంఏ  గ్రాంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి రూ.4కోట్లు మంజూరు చేశారు. ఈ పనులను ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీకి అప్పగించగా ఆ శాఖ ఆధ్వర్యంలో కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పనులు ప్రారంభించారు. కాగా బిల్లులు సరిగా రాకపోవడంతో పాటు, ఆఫీసర్ల పర్యవేక్షణ లేక పలు నిర్మాణాలు స్లాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గోడలు వరకు రాగా.. మరికొన్నింటికి పనులే మొదలుపెట్టలేదు. 

స్లోగా ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పనులు

బల్దియాలోని 45వ డివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూడా మరో ఇంటిగ్రేటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మించడానికి 2022 జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పనులు మొదలు పెట్టారు. దీనికోసం రూ.4.50 కోట్ల పట్టణ ప్రగతి నిధులను కేటాయించారు. ఈ కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పండ్లు, పూలు, కూరగాయలు, నాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వెజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమ్మేందుకు మొత్తం 98 రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు నిర్మించడానికి నిర్ణయించారు. అయితే ఆ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయి. ఏడాదిన్నర  కాలంలో ఇప్పటి వరకు ఫిల్లర్లు మాత్రమే నిర్మించడం గమనార్హం.