
ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) సెక్యూరిటీ అసిస్టెంట్ (మోటార్ ట్రాన్స్పోర్ట్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, అస్కతిగల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు.
పోస్టుల సంఖ్య: 455 (హైదరాబాద్లో 7 పోస్టులు ఉన్నాయి)
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి పదోతరగతి లేదా సమాన అర్హత కలిగిఉండాలి. చెల్లుబాటు అయ్యే లైసెన్స్ ఫర్ మోటర్ కార్స్(ఎల్ఎంవీ) ఉండటంతోపాటు మోటార్ మెకానిజంపై పరిజ్ఞానం ఉండాలి. కనీసం ఏడాది డ్రైవింగ్ అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 27 ఏండ్ల మధ్యలో ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్లు ప్రారంభం: సెప్టెంబర్ 06.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 28.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.650. ఇతరులకు రూ.550.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు mha.gov.in వెబ్సైట్లో సంప్రదించగలరు.