బలపడుతున్న మావోయిస్టులు

బలపడుతున్న మావోయిస్టులు
  • నాలుగు రాష్ట్రాల్లో పుంజుకుంటున్నారు: ఇంటెలిజెన్స్ వర్గాలు
  • నంబాళ్ల కేశవరావు నాయకత్వంలో ఏకమవుతున్న కేడర్‌
  • చత్తీస్‌ గఢ్‌ , బీహార్‌, జార్ఖండ్‌ ,మహారాష్ట్రలో పెరుగుతున్న కార్యకలాపాలు
  • సురక్షిత ప్రాంతాలకు బేస్‌ మార్చుకునే యత్నాలు

మావోయిస్టులు చాప కింద నీరులా దేశంలో తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నారని, నాలుగు రాష్ట్రాల్లో పుంజుకుం టున్నారని ఇంటెలిజెన్స్‌‌  వర్గా లు వెల్లడిస్తున్నాయి. ఇటీవల చత్తీస్‌ గఢ్‌ , బీహార్‌ , జార్ఖండ్‌ ,మహారాష్ట్రలో హింసాత్మక ఘటనలు పెరుగుతుండటమే ఇందుకు నిదర్శనమని చెబుతున్నాయి.లోక్‌ సభ ఎన్నికలకు రెండ్రోజుల ముందు ఏప్రిల్‌ 9న చత్తీస్‌ గఢ్‌ లోని దంతేవాడలో మావోయిస్టులు బీజేపీ ఎమ్మెల్యే  భీమా మండవితోపాటు మరో నలుగురు సెక్యూరి టీ సిబ్బందిని చంపేశారు. ఇది జరిగిన కొద్దిరోజులకే మహారాష్ట్రలోని గడ్చిరోలిలో 15 మంది సీఆర్‌ పీఎఫ్‌ జవాన్లను బలితీసుకున్నారు. ‘‘మావోయిస్టులు పుంజుకుం టున్నారని ఈ ఘటనలే చెబుతున్నాయి. మావోయిస్టు కేడర్‌ ఏకమవడమే కాదు..వ్యూహాలు, దాడుల విధానాన్ని మార్చుకుంటూ ముందుకెళ్తున్నారు’’ అని ఇంటెలిజెన్స్‌‌ ఉన్నతాధికారి ఒకరు చెప్పా రు. తమ రిపోర్టును సీఆర్‌ పీఎఫ్‌ తోపాటు సెక్యూరిటీ బలగాలకు అందజేసినట్టు ఆయన తెలిపారు. దేశంలో మావోయిస్టుల ప్రాబల్యం బాగా తగ్గిందని ఏడాది కిందట హోంమంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ చెప్పా రు. గతంలో నక్సల్స్‌‌ ప్రభావిత జిల్లాలు 126 ఉంటే ఇప్పుడు 10–12 జిల్లాలకు తగ్గినట్టు ‌వివరించారు.

నంబాళ్ల నాయకత్వంలో..

మావోయిస్టు పార్టీ జనరల్‌ సెక్రటరీ బస్వరాజ్‌ అలియాస్‌ నంబాళ్ల కేశవరావు నేతృత్వం లో చత్తీస్‌ గఢ్‌ , బీహార్‌ , జార్ఖండ్‌ , మహారాష్ట్ర కేడర్‌ ఏకమవుతున్నట్టు నిఘా వర్గా లు చెబుతున్నాయి. ‘‘పార్టీలో 25 ఏళ్లపాటు పనిచేసిన జీఎస్‌ గణపతి స్థానంలోకి గతేడాది డిసెంబర్‌ లో కేశవరావు వచ్చారు. వ్యూహాలు పన్నడంలో ఈయన దిట్ట. భద్రతా బలగాలపై ఎన్నోసార్లు మెరుపు దాడులకు పాల్పడ్డా రు. ఇప్పుడు ఆయన కేడర్‌ నంతా ఒక్కటి చేసే పనిలో ఉన్నారు. చత్తీస్‌ గఢ్‌ , మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ , ఒడిశా,జార్ఖండ్‌ , బీహార్‌ లో యూత్‌ ను రిక్రూట్‌ చేసుకుంటున్నారు’’ అని ఇంటెలిజెన్స్‌‌ ఆఫీసర్‌ ఒకరు తెలిపారు. బీహార్‌ లో ప్రమోద్‌ మిశ్రా జైలు నుంచి విడుదల కావడంతో ఆ రాష్ట్రంలో మావోయిస్టు దాడులు పెరుగుతున్నట్టు ఆయన వివరించారు. పార్టీ పొలిట్‌ బ్యూరో హెడ్‌ గా పనిచేసిన ఈయనపై 22 కేసులున్నాయి.2008 మే లో అరెస్టయిన ఆయన 2017 ఆగస్టులో రిలీజ్‌ అయ్యారు.

జార్ఖండ్‌ లో గనులపై పెత్తనం

జార్ఖండ్‌ లో ఓపెన్‌ కాస్ట్‌‌ బొగ్గు గనులపై పట్టు పెంచుకునేందుకు మావోయిస్టులు ప్రయత్నం చేస్తున్నారు. ఆమ్రపాలి మగద్‌ కోల్‌ ఫీల్డ్‌‌ ప్రాజెక్టు, సెంట్రల్‌ కోల్‌ ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ (సీసీఎల్‌ ) ఆఫీసర్లు మావోయిస్టులకు డబ్బు లు అందజేస్తున్నట్టు ఇంటెలిజెన్స్‌‌ వర్గా లు గుర్తించాయి. ఇలా లోపాయి కారీగా వారికి సాయమందిస్తున్న పలు కోల్‌ కంపెనీల మేనేజర్లు, ఆఫీసర్ల ఇళ్లలో కిందటేడాది అక్టోబర్‌ లో ఎన్‌ ఐఏ బృందాలు సోదాలు చేశాయి. మావోయిస్టులకు వీరి ద్వారా డబ్బులు అందుతున్నట్టు ఈ దాడుల్లో తేలిం ది. సెంట్రల్‌ కమిటీ,పొలిట్‌ బ్యూరో సభ్యుడు బి.సుధాకర్‌ లొంగిపోవడంతో జార్ఖండ్‌ లో పార్టీ కాస్త బలహీనపడిందని, అయితే ఆయన స్థానంలోకి మిథిలేశ్‌ సింగ్‌ మహతో అలియాస్‌ దుర్యోధన్‌ రావడంతో మళ్లీ పుంజుకుందని ఇంటెలిజెన్స్‌‌ వర్గాలు చెబుతున్నాయి. బలగాలు ముమ్మరంగా కూంబిం గ్‌ చేపట్టడంతో మావోస్టులు తమస్థావరాలను మార్చుకునే పనిలో పడ్డట్టు వివరిస్తున్నాయి.