
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 7 నుంచి 12 వరకు జరగనున్నాయి. ఫస్టియర్ స్టూడెంట్స్‌కు ఉదయం 8.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండియర్ స్టూడెంట్స్‌కు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 వరకూ ఎగ్జామ్స్ కొనసాగుతాయని ఇంటర్‌బోర్డు కార్యదర్శి అశోక్‌కుమార్ మంగళవారం వెల్లడించారు. మొత్తం 4,63,236 మంది హాజరుకానున్నారని, ఇందులో ఫస్టియర్ స్టూడెంట్స్ 3,00,847 మంది రాస్తుండగా ఇందులో 1,48,463 మంది ఇంప్రూవ్‌మెంట్, 1,52,384 మంది ఫెయిల్ అయినవారు ఉన్నట్టు చెప్పారు. 1,62,389 మంది సెకండియర్ విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని, 857 సెంటర్లు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. పరీక్షల నిర్వహణకు కలెక్టర్ చైర్మన్‌గా హైపవర్ కమిటీలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఎగ్జామ్ సెంటర్లలోకి సెల్‌ఫోన్స్, ఎలక్ర్టానిక్ పరికరాలకు అనుమతి లేదన్నారు.
ఓఎంఆర్‌లో తప్పొలొస్తే స్టూడెంట్స్‌దే బాధ్యత…
ఓఎంఆర్ షీట్‌లో తప్పులొస్తే తమ బాధ్యత కాదని, అది విద్యార్థులే సరిచూసుకోవాలని ఇంటర్‌బోర్డు కార్యదర్శి అశోక్‌కుమార్ తెలిపారు. తప్పులొస్తే వెంటనే ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకుపోవాలని సూచించారు.
రీవెరిఫికేషన్‌లో 1,155 మంది పాస్…
అనామిక మార్కుల విషయంలో క్లరికల్ పొరపాటు జరిగిందని, సదరు లెక్చరర్‌పై చర్యలు తీసుకుంటామని అశోక్ చెప్పారు. ఎంసెట్ కన్వీనర్‌కు ఇంటర్ మార్కులను బుధవారం పంపిస్తామన్నారు. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌లో ఐదు మార్కులు పెరిగినా, ఫెయిల్ అయిన విద్యార్థి పాసైనా వారి పేపర్లు దిద్దిన వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. రీవెరిఫికేషర్ ద్వారా 1,155 మంది పాసయ్యారన్నారు. 6న హైకోర్టుకు పూర్తి నివేదిక అందజేస్తామని చెప్పారు. అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ డేటాఎంట్రీ బాధ్యతలను గ్లోబరీనాతోపాటు డేటాటెక్ మెథడిక్స్ సంస్థకు అప్పగించినట్టు చెప్పారు.