
దొంగతనాలు కట్టడి చేయడానికి నిర్మల్ జిల్లాలోని ఓ గ్రామం తీసుకున్న నిర్ణయం అందరిని ఆలోచింపజేస్తుంది. గ్రామంలో తరచూ చోరీలు జరుగుతుండటంతో గ్రామస్థులంతా కలిసి సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇంతకీ ఆ గ్రామస్థులు తీసుకున్న నిర్ణయం ఏంటి.? ఏం జరిగిందో తెలుసుకుందాం.
నిర్మల్ జిల్లా బైంసా మండలం వాలేగామ్ గ్రామంలో తరచూ చోరీలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గ్రామస్థులంతా కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. అది ఏంటంటే.? కొత్తవాళ్లు ఊరిలో అడుగు పెట్టాలంటే సమయపాలన పాటించాలనే నిబంధన పెట్టారు గ్రామస్తులు. ఉదయం ఆరుగంటల నుంచి పదిగంటల వరకు, సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు మాత్రమే గ్రామంలోకి రావాలని బోర్డు ఏర్పాటు చేశారు గ్రామస్థులు. భిక్షాటన చేసేవాళ్లకు, చిరు వ్యాపారులకు ఈ సమయపాలన వర్తిస్తుందని చెప్పారు. ఒక వేళ ఈ సమయం దాటాక ఎవరైనా గ్రామంలోకి వస్తే రూ. 500 జరిమానా విధిస్తామని ఆ బోర్టులో తెలిపారు గ్రామస్థులు.
ALSO READ : ఎంత పెద్ద నాయకుడైన పార్టీనే సుప్రీం: టీబీజేపీ చీఫ్రామచందర్ రావు హాట్ కామెంట్స్
గ్రామంలో చోరీల కట్టడికే ఈ నియమం పెట్టామని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ నియమంతో గ్రామంలో దొంగతనాలు తగ్గాయని చెబుతున్నారు గ్రామస్థులు. ఏది ఏమైనా గ్రామస్థులు తీసుకున్న నిర్ణయానికి చాలా మంది మద్దతు తెలుపుతున్నారు.