Inter practical exams: ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ డేట్ వచ్చేసింది

Inter practical exams: ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ డేట్ వచ్చేసింది

తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ డేట్స్ అనౌన్స్ చేసింది. ఈ నెల 15నుంచి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు జనరల్‌, ఒకేషనల్‌ కోర్సుల ప్రాక్టికల్‌ పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2వ తేదీ వరకు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్ట్ సెషన్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సెకండ్ సెషన్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. 

కాలేజీ ఫీజు చెల్లించాలని విద్యార్థులపై ఒత్తిడి చేయకుండా హాల్ టిక్కెట్లు జారీ చేయాలని తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అన్ని జూనియర్ కాలేజీలను ఆదేశించింది. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ తర్వాత మార్చి 4న ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్ పరీక్షలను, మార్చి 6న ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను నిర్వహిస్తారు. ఈ రెండు పరీక్షలు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు జరుగుతాయి. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 15 నుండి ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి. విద్యార్థులు తమ ఐడీ ద్వారా వెబ్‌సైట్‌ లో లాగిన్‌ అయి హాల్‌ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.