ఇవాళ్టి నుంచి ఇంటర్ ఇంగ్లిష్ ప్రాక్టికల్స్

ఇవాళ్టి నుంచి  ఇంటర్ ఇంగ్లిష్ ప్రాక్టికల్స్
  • ఇయ్యాల ఫస్టియర్.. రేపు సెకండియర్ స్టూడెంట్లకు ఎగ్జామ్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ఎగ్జామ్స్ హడావుడి మొదలైంది. థియరీ పరీక్షలకు ముందే నిర్వహించే ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రెండ్రోజుల పాటు జరిగే ఈ పరీక్షలకు మొత్తం 9,00,607 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. బుధవారం ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ నిర్వహించనుండగా, ఆ పరీక్షలకు 4,89,069 మంది హాజరుకానున్నారు. గురువారం సెకండియర్ విద్యార్థులకు ఎగ్జామ్ ఉండగా,  4,11,538 మంది విద్యార్థులు హాజరవ్వనున్నారు. కాగా, విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ పరీక్షించేందుకు గతేడాది నుంచి ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ ను అధికారులు నిర్వహిస్తున్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు. అయితే, జేఈఈ మెయిన్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులకు వెసులుబాటు కల్పించనున్నట్టు చెప్పారు.