
ఇంటర్మీడియెట్ యాన్యువల్ ఎగ్జామ్స్ కు ఫీజు డేట్లు వెల్లడయ్యాయి. వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఇంటర్ వార్షిక పరీక్షలకు పరీక్ష ఫీజు షెడ్యూల్‌ను అధికారులు గురువారం విడుదల చేశారు. జనరల్, ఒకేషనల్ కోర్సు ఫస్టియర్,సెకండియర్ స్టూడెంట్లు ఈ నెల 26 నుంచి అక్టోబర్ 29 వరకూ ఫీజు చెల్లించవచ్చని బోర్డు కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు. ఎగ్జామ్ ఫీజు రూ.470 , ప్రాక్టికల్స్ ఫీజు రూ.180 చెల్లిం చాలని చెప్పారు. రూ.వంద ఫైన్ తో అక్టోబర్ 30 నుంచి నవంబర్ 13 వరకు, రూ.500 ఫైన్ తో నవంబర్ 14 నుంచి 25 వరకు, రూ.వెయ్యి ఫైన్ తో నవంబర్ 26 నుంచి డిసెంబర్ 5 వరకు, రూ.2 వేల ఫైన్ తో డిసెంబర్ 6 నుంచి 16 వరకు ఫీజు చెల్లించవ్చని తెలిపారు.