తెలంగాణలో ఇంటర్ పరీక్షలు వాయిదా

తెలంగాణలో ఇంటర్ పరీక్షలు వాయిదా
  • ఫస్టియర్ విద్యార్థులు ప్రమోట్.. భవిష్యత్తులో వీలునుబట్టి పరీక్ష
  • ఈఏడాది ఎంసెట్‌కు వెయిటేజీ వర్తించదు: ఇంటర్మీడియట్ బోర్డు

హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షలపై బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సెకండ్ వేవ్ విజృంభణ ధాటికి పలు రాష్ట్రాల్లో టెన్త్ పరీక్షలు రద్దు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన కొద్దిసేపటికే ఇంటర్మీడియట్ బోర్డు కూడా స్పందించింది. ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. జూన్ మొదటి వారంలో పరిస్థితిని సమీక్షించి పరీక్షల షెడ్యూల్ ను ప్రకటిస్తామని స్పష్టం చేసింది. సెకండియర్ విద్యార్థుల బ్యాక్ లాగ్ సబ్జెక్టులకు మాత్రం మినిమం పాస్ మార్కులు ఇస్తామని తెలియజేసింది. ఫస్టియర్ విద్యార్థులను నేరుగా సెకండియర్ కు ప్రమోట్ చేస్తామని..  అయితే భవిష్యత్ లో వీలును బట్టి వాళ్లకు పరీక్షలు నిర్వహిస్తామని వివరించింది. ఈ ఏడాది ఎంసెట్ కు 25 శాతం ఇంటర్ మార్కుల వెయిటేజీ వర్తించదని బోర్డు స్పష్టం చేసింది.