తెలంగాణలో ఇంటర్ ఎగ్జామ్స్‌‌‌‌ ఫీజు గడువు పెంపు

తెలంగాణలో ఇంటర్ ఎగ్జామ్స్‌‌‌‌ ఫీజు గడువు పెంపు
  • ఫైన్‌‌‌‌తో వచ్చే నెల 3 వరకు ఫీజు కట్టేందుకు అవకాశం 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ఎగ్జామ్ ఫీజు చెల్లింపు గడువును బోర్డు పొడిగించింది. రూ.2,500 ఫైన్‌‌‌‌తో ఈ నెల 30 నుంచి జనవరి 3 వరకు ఫీజు చెల్లించవచ్చని బోర్డు సెక్రటరీ శృతి ఓజా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు ఇంటర్‌‌‌‌‌‌‌‌ ఎగ్జామ్ రాసేందుకు 9,77,040 మంది స్టూడెంట్లు ఫీజు చెల్లించారు. ఈ ఏడాది ఇంటర్‌‌‌‌‌‌‌‌లో మొత్తం 10,59,233 మంది అడ్మిషన్ తీసుకోగా, 92.24 శాతం మంది ఫీజు కట్టారు. 

ప్రాక్టికల్ డేట్లు మార్చుకోవచ్చు: సీఓఈ 

ఫిబ్రవరి 1న జేఈఈ ఎగ్జామ్ చివరి రోజు ఉండగా, అదే రోజు ఇంటర్ ప్రాక్టికల్స్ ప్రారంభం అవుతున్నాయి. ఈ సమయంలో ఇంకా ఏదైనా ఎగ్జామ్ ఉన్నా.. ఆయా తేదీల్లో ప్రాక్టికల్స్ ఉన్న స్టూడెంట్లు వేరే బ్యాచ్‌‌‌‌కు మార్చుకునే అవకాశం కల్పిస్తున్నామని ఇంటర్​ బోర్డు సీవోఈ జయప్రద తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. ఆధారాలతో కాలేజీ ప్రిన్సిపల్‌‌‌‌ను లేదా ఇంటర్మీడియెట్ ఆఫీసర్లను సంప్రదించాలని సూచించారు.