ముస్లిం, హిందూ భార్యభర్తలపై చార్మినార్ లో వేధింపులు: పోలీస్ కేసు

ముస్లిం, హిందూ భార్యభర్తలపై చార్మినార్ లో వేధింపులు: పోలీస్ కేసు

ముస్లిం, హిందూ భార్యభర్తలపై చార్మినార్ దగ్గర కొందరు దాడి చేశారు. బుర్ఖా ధరించిన మహిళ తన భర్తతో కలిసి చార్ మినార్ కు వచ్చింది. వారితోపాటు చిన్నారి కూడా ఉంది. ఆ జంటపై కొంతమంది స్థానిక యువకులు గుంపుగా వచ్చి దాడి చేసి వేధించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

మతాంతర వివాహం చేసుకున్న రాజేందర్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి చార్ మినార్ చూసేందుకు వచ్చాడు. ఆజంటకు పాప కూడా ఉంది. ఆమె  బుర్ఖా ధరించి ఉంది. అయితే కొందరు స్థానిక యువకులు వారిని చుట్టుముట్టి రాజేందర్, అతని పాపపై  దాడి చేశారు. ఆ జంటపై దాడి చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. హిందువైన రాజేందర్ ను పెండ్లి చేసుకోవడానికి సిగ్గుగా లేదా అని ఆ మహిళను యువకులు బూతులు తిట్టారు. బుర్ఖా తీసేసి ఎక్కడికైనా వెళ్లు అని బెదిరించారు. చిన్నారిని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ జంటకు జరిగిన అవమాన కర దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. 

Also Read: మెట్రో రైలులో హోలీ వీడియో చేసిన అమ్మాయిలు అరెస్ట్

రాజేందర్ ను కొట్టే సమయంలో పాపను కూడా కొట్టనట్లు వీడియోలు కనిపిస్తుంది. దాడిలో గాయపడిన పాప ఏడవడం ప్రారంభించింది. దాడి తర్వాత రాజేందర్ పోలీసులను ఆశ్రయించడంతో చార్ మినార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు .