టాలెంట్ తొక్కేస్తారా..? : మెట్రో రైలులో హోలీ వీడియో చేసిన అమ్మాయిలు అరెస్ట్

టాలెంట్ తొక్కేస్తారా..? : మెట్రో రైలులో హోలీ వీడియో చేసిన అమ్మాయిలు అరెస్ట్

హోలీ రోజున ఇద్దరు అమ్మాయిలు ఢిల్లీ మెట్రో, రోడ్లపై హోలీ రీల్స్  చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే వీరికి ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు 37 వేల రూపాయల జరిమానా కూడా విధించారు. దీంతోపాటు హోలీ ముసుగులో నోయిడాలో వీధుల్లో, ఢిల్లీ మెట్రోలో తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా రీల్స్ చేశారని పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు.  

హెల్మెట్ లేకుండా ట్రిపుల్ రైడింగ్ చేస్తూ స్కూటర్ పై అసభ్యకరంగా రీల్స్ చేయడంతో ప్రీతి , వినీత, పీయూస్ లపై రూ. 33 వేల జరిమానా విధించారు నోయిడా ట్రాఫిక్ పోలీసులు. అధికారులు జారీ చేసిన జరిమాన చెల్లించేందుకు తమ వద్ద డబ్బులు లేవని  మీడియాకు తెలిపారు ఆ ఇద్దరు అమ్మాయిలు. తాము స్కూటర్ పై తొలిసారిగా రీల్స్ చేశామని, పోలీసులు ఎక్కువ మొత్తంలో జరిమానా విధించారని వాపోయారు. తాము చేసిన పనికి ఆ అమ్మాయిలు క్షమాపణలు కూడా చెప్పారు. ఇలా ఇంకెప్పుడు చేయమని చెప్పారు. మేం స్టంట్స్ చేయలేం..ఇన్స్టాగ్రామ్ రీల్స్ ను చేశామన్నారు. 

Also Read:CBSE విధానంపై తల్లిదండ్రుల ఆందోళన

అయితే ఈ విషయం తెలిసిన నెటిజన్లు.. అమ్మాయిలపై కొంచెం సానుభూతిని చూపిస్తున్నారు..వాళ్లు వారి టాలెంట్ ను ప్రదర్శించారు. జరిమానాలు కేసులతో టాలెంట్ ను తొక్కేస్తున్నారని అంటున్నారు.